అమెరికాలో గర్జించిన తుపాకీ.. ఒకరి దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు!

  • వాషింగ్టన్ లోని సియాటెల్ లో ఘటన
  • రైల్వేస్టేషన్ లో ఓ దుండగుడి కాల్పులు
  • ఘటన అనంతరం పరారైన నిందితుడు
అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ నగరం రైల్వే స్టేషన్ లో ఓ దుండగుడు ప్రయాణికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 9.20 నిమిషాలకు స్టేషన్ లోకి వచ్చిన ఆగంతుకుడు.. తన తుపాకీ తీసి కాల్చడం మొదలుపెట్టాడు. బుల్లెట్లు అయిపోగానే అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాద విషయం తెలుసుకున్న అత్యవసర సేవల సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ నిందితుడు నల్లటి మాస్క్ ధరించి ఉన్నాడని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. ఈ నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. కాగా, క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు.
Go Back to Shorts
USA
Washington
Seattle
Shootout
One dead
Police

More Telugu News